¡Sorpréndeme!

PBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP Desam

2025-04-20 3 Dailymotion

 ఐపీఎల్ సగం సీజన్ ఆల్రెడీ ముగిసిపోయింది. ప్రస్తుతానికి అన్ని టీమ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలతోనే ఉన్నాయి. కావాల్సిందల్లా వరుస విజయాలు మాత్రమే. అయితే ఆర్సీబీ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్ లు ఆడిన RCB వాటిలో 4 మ్యాచుల్లో విజయం సాధించింది. మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. గెలిచిన నాలుగు మ్యాచులు బెంగుళూరు బయటే కాగా...బెంగుళూరు చిన్న స్వామి లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయి హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ ను అస్సలు పొందలేకపోతోంది. పైగా ఈ రోజు జరిగే మ్యాచ్ పంజాబ్ తో. మొన్ననే పంజాబ్ బెంగుళూరులో ఆడి ఆర్సీబీని ఓడించింది. వర్షం కారణంగా ఆ మ్యాచ్ లో స్కోర్ థ్రిల్లర్ లా మారిపోతే గెలుపు పంజాబ్ వశమైంది. ఈ రోజు అదే పంజాబ్ తో పంజాబ్ లోనే మ్యాచ్ ఆడుతోంది ఆర్సీబీ. మరి పటీదార్ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా. పంజాబ్ విసిరిన ప్రశ్నలకు కొహ్లీ సమాధానం చెప్పి వస్తాడా అనేది ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా మారనుంది. రెండు సైడ్లు అన్ని విభాగాలు పటిష్ఠంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కి ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ తో మొదలు పెట్టి శశాంక్ సింగ్ వరకూ మ్యాచ్ కో విన్నర్ పుట్టుకొస్తుంటే..బౌలింగ్ భారాన్ని అర్ష్ దీప్ సింగ్, మార్కో జాన్సన్ , చాహల్ సమర్థంగా మోస్తున్నారు. మ్యాక్స్ వెల్ కూడా ఫామ్ లోకి వస్తే పంజాబ్ కి పండగే. మరో వైపు ఆర్సీబీ పరిస్థితి అంతే. అందరూ ఆడే వాళ్లే కానీ హోం గ్రౌండ్ మ్యాచుల్లో తేలిపోతున్నారు. బట్ ఈరోజు మ్యాచ్ బయట కాబట్టి ఎవే మ్యాచ్ స్ లో తన విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తది ఏమో చూడాలి.ఫిల్ సాల్ట్, కొహ్లీ, పటీదార్ నమ్ముకునే బ్యాటింగ టీమ్ ఉంది. టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ అవసరమైన సందర్భాల్లో అండగా నిలబడుతున్నారు. బౌలింగ్ లో హేజిల్ వుడ్, భువీ తమ జోరు కొనసాగిస్తే ఈ రోజు పంజాబ్ ను ఆర్సీబీ చిత్తు చేయటం ఖాయం. లేదంటే మాత్రం పంజాబ్ పంజా దెబ్బ రుచి చూడాల్సి ఉంటుంది.